28 February, 2026 | 2:43 AM

అతిథులకు ఆహ్వానం అందజేసిన ఏఎంసీ చైర్మన్

28-02-2026 12:57 AM

ఇల్లందు టౌన్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలోని సింగరేణి గ్రౌండ్లో నిర్వహించబోయే సద్గురు సంతు సేవాలాల్ మహరాజు జయంతి ముగింపు వేడుకలకు అతిథులుగా హాజరు కావాలని కోరుతూ ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి రాహుల్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రోహిత్ రాజును వారి కార్యాలయాల్లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపీ బలరాం నాయక్ హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రెపల్లెవాడ సర్పంచ్ బానోత్ శారద, సుదిమళ్ల మాజీ సర్పంచ్ కల్తీ పద్మ, టౌన్ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు గాలిపల్లి స్వరూప తదితరులు పాల్గొన్నారు.