రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో ఫినాయిల్ తయారీలో శిక్షణ
చర్ల, ఫిబ్రవరి 27, (విజయక్రాంతి): చర్ల మండల కేంద్రంలోని స్థానిక రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో శుక్రవారం రాహుల్ హై స్కూల్ విద్యార్థులకు ఫినాయిల్ తయారీ పై శిక్షణ నిర్వహించారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ పీయఫ్) 141 బెటాలియన్ వారి సివిక్ యాక్షన్ ప్రోగ్రాం లో భాగంగా కమాండెంట్ రితీష్ కుమార్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ మనీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ శిక్షణా కార్యక్రమంలో అతి తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే ఫినాయిల్ తయారు చేసే విధానాన్ని నిపుణులు ప్రత్యక్షంగా వివరించారు. వైట్ ఫినాయిల్ తయారీకి కావాల్సిన రసాయనాలను, నాణ్యతను పెంచే పద్ధతులు , మార్కెటింగ్ నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సీఆర్ పియఫ్ అధికారులు, శిక్షకులు శంకర రావు, రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం డైరక్టర్ కొసరాజు హరిచరణ్, ఉపాధ్యాయులు బిట్రగుంట క్రాంతి కుమార్, యస్కే ఉస్మాన్, శెట్టి సునీత, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.




