పీసీసీ చీఫ్‌ను కలిసిన ఏఎంసీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నేతలు
ఆమనగల్లు, జూన్ 6 (విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను శనివారం పలువురు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాలకూర్ల రవికాంత్ గౌడ్, ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, రేవంత్ మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు చందోజి తదితరులు పీసీసీ చీఫ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం, అంకితభావంతో కష్టపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. రాబోయే రోజుల్లో భర్తీ చేయబోయే నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ పదవుల్లోనూ కష్టపడిన వారికి ప్రాధాన్యత కల్పించి, అవకాశం ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడికి విన్నవించారు. ఈ వినతిపై మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించారని, పార్టీ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చినట్లు నాయకులు పేర్కొన్నారు.






