6 June, 2026 | 4:37 PM

Breaking News

వికారాబాద్‌లో ఘోరప్రమాదం.. హోటల్ స్లాబ్ కూలి ఒకరు మృతి   •   హైదరాబాద్‌లో భారీ వర్షం   •   ధాన్యం అన్‌లోడ్ ఆలస్యం.. రాజీవ్ రహదారిపై రైతుల బైఠాయింపు   •   అధికార లాంఛనాలతో ఏఆర్ కానిస్టేబుల్ రాజు అంత్యక్రియలు   •   Phone Tapping Case: కేసీఆర్‌పై ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు   •   బడి ఈడు పిల్లలను పాఠశాలలు చేర్పించాలి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ప్రధాన లక్ష్యం : జిల్లా కలెక్టర్ అంకిత్   •   అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి   •   ఇసుక కొరతను నివారించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి   •   మంథని టీజీఎస్‌ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక   •  

దాబ హోటల్ పై ఎక్సైజ్ శాఖ దాడులు

06-06-2026 03:23 PM

నిర్మల్ జూన్ 6 (విజయక్రాంతి): ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి (DPEO) శ్ ఎం.ఏ. రజాక్  ఆదేశాల మేరకు నిర్మల్ రూరల్ మండల పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు ఇన్‌స్పెక్టర్  రంగస్వామి తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు ఇతర రాష్ట్రాల మద్యం నిర్మల్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని ఢాబాలలో విక్రయిస్తున్నారనే సమాచారంతో, మండిగుట్ట శివారులో గల  సింగ్ ఈజ్ కింగ్ ఢాబాలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. అనంతరం నిర్మల్ రూరల్ పరిధిలోని ఇతర ఢాబాలలో కూడా తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా అన్ని ఢాబా యజమానులకు తమ ప్రాంగణాల్లో మద్యం విక్రయాలు, నిల్వలు మరియు వినియోగానికి అనుమతి లేదని హెచ్చరించారు. ఎవరైనా ఇతర రాష్ట్రాల మద్యం విక్రయిస్తున్నట్లు తెలిసిన వెంటనే ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే ఫంక్షన్ హాల్స్, హోటళ్లు, లాడ్జీలు మరియు బ్యాంక్వెట్ హాల్స్‌పై నిరంతర నిఘా కొనసాగుతుందని, ఎవరైనా ఇతర రాష్ట్రాల మద్యం విక్రయించినా, కొనుగోలు చేసినా లేదా నిల్వ ఉంచినా వారిపై ఎక్సైజ్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తనిఖీలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఆదిలాబాద్ శ్రీ గంగారెడ్డి, ఎస్‌ఐ శ్రీ అభిషేక్, డీటీఎఫ్ ఎస్‌ఐ శ్రీమతి సింధు మరియు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.