calender_icon.png 10 February, 2026 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామప్పను సందర్శించిన అమెరికా దేశస్తులు

09-02-2026 12:28:36 AM

వెంకటాపూర్, ఫిబ్రవరి08,(విజయక్రాంతి):ప్రపంచ వారసత్వ సంపదగా గు ర్తింపు పొందిన ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని అమెరికా దే శానికి చెందిన ఏలినా, జోష్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయ శిల్పకళ, నిర్మాణ శైలి, చారిత్రక ప్రాశస్త్యాన్ని ఆసక్తిగా పరిశీలించారు. శిల్పాల నైపుణ్యం, శతాబ్దాల నాటి కళాత్మకతను టూరిజం గైడ్ విజయ్ దా ్వరా తెలుసుకొని మంత్రముగ్ధులయ్యామని తెలిపారు.

ముఖ్యంగా ఆలయంలోని శిల్పాల సూక్ష్మత, రాతి పనితనం ప్రపంచ స్థాయి అద్భుతమని కొనియాడారు. రామ ప్ప దేవాలయం భారతదేశ సంస్కృతి, వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోందని, ఇలాంటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవడం అంద రి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ పర్యటన తమకు ఒక అమూల్య అనుభవంగా నిలిచిపోతుందని అమెరికా దేశస్తులు తెలిపారు.