6 July, 2026 | 6:52 AM

పీర్జాదిగూడ మేయర్‌గా అమర్‌సింగ్

31-08-2024 03:43 AM

మేడిపల్లి, ఆగస్టు 30 (విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా అమర్‌సింగ్ ఎన్నికయ్యారు. ఇటీవల మేయర్ జక్క వెంకట్‌రెడ్డిపై అవిశ్వాసం పెట్టిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు.. మెజార్టీ సభ్యుల మద్దతుతో అమర్ సింగ్‌ను మేయర్‌గా ఎన్నుకున్నారు. అమర్‌సింగ్ నాలుగున్నర నెలల పాటు మేయర్‌గా కొనసాగనున్నారు.