6 July, 2026 | 8:00 AM

కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కులగణన చేయాలి

31-08-2024 03:42 AM
  1. బీసీ నాయకుల డిమాండ్ 
  2. గాంధీలో కొనసాగుతున్న ఆమరణ దీక్ష 
  3. పరామర్శించిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి): కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టాలని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్, హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్ డిమాండ్ చేశారు. బీసీ కులగణన చేపట్టాలని వారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం ఆరో రోజుకు చేరింది. గాంధీ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న వారిని శుక్రవారం బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పరామర్శించారు. కుల గణన చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వివిధసంఘాల నాయకులు దాసు సురేష్, కాసాని శ్రీనివాస్‌రావు, సీహెచ్ రాజు, కేవీ గౌడ్, బీఎస్పీ ప్రధాన కార్యదర్శి ఏ కామేష్, నారాయణగౌడ్ పరామర్శించారు.