26 April, 2026 | 5:41 AM

నెక్లెస్ రోడ్‌లో డ్రగ్స్ స్వాధీనం

11-05-2024 02:18 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (విజయక్రాంతి) : మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి నగరవ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీ లు నిర్వహిస్తున్నారు. మాదకద్రవ్యా లు విక్రయిస్తున్న, సరఫరా చేస్తున్న నిందితులను గుర్తించి, వారిపై కేసు లు నమోదు చేసి జైల్లోకి నెడుతున్నారు. శుక్రవారం నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్ వద్ద ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం, పోలీసులు సంయు క్తంగా నిర్వహించిన తనిఖీల్లో,  ముగ్గురు డ్రగ్ పెడ్లర్లు పట్టుబడ్డారు. డ్రగ్స్ తరలిస్తున్న అబ్బుల సాయి శరత్(25), అబ్బుల శ్రవణ్(23), శ్రీవాస్తవ్ రిషబ్(27)లను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ. 3లక్షల విలువ చేసే 11.34గ్రాముల కొకైన్, 3.66 గ్రాము ల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై మాదకద్రవ్యాల యాక్ట్ కింద కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. 

మాదకద్రవ్యాలకు బానిసలైన నిందితులు, ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఆశతో డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముంబాయికి చెందిన డ్రగ్ పెడ్లర్ నుంచి కొరియర్ ద్వారా మాదకద్రవ్యాలను దిగుమతి చేసుకుంటున్నట్లు ప్రాథమిక విచారణ లో గుర్తించారు.