17 June, 2026 | 10:58 PM

అమ్మ మాట-అంగన్వాడి బాట

17-06-2026 09:31 PM

కరీంనగర్ క్రేమ్: నగర పాలక సంస్థ 3వ డివిజన్ వల్లంపహాడ్ పరిధిలోని సంతోష్ నగర్ అంగన్‌వాడీ స్కూల్‌లో బుధవారం అమ్మ మాట - అంగన్వాడి బాట’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ బడులలో చేరికలను ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి చిన్నారులకు అంగన్‌వాడీ సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ సాదినేని లావణ్య-మునిందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదేళ్ల లోపు పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాలు ఎంతో మేలు చేస్తాయని, ఇక్కడ అందించే పౌష్టికాహారం, ప్రాథమిక విద్య పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందన్నారు. అర్హులైన పిల్లలందరినీ తల్లిదండ్రులు అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని ఆమె కోరారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో  చేరనున్న చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ అరెల్లి అంజమ్మ, ఆయా, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.