సింధు టెక్స్‌టైల్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే
17-06-2026 09:28 PM
నవాబ్‌పేట్: మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సింధు టెక్స్‌టైల్స్ శారీ హౌస్‌ను జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఇలాంటి పెద్ద వస్త్ర దుకాణాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్థానికంగానే నాణ్యమైన దుస్తులు లభించడం వల్ల ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవుతాయని పేర్కొన్నారు. నవాబ్‌పేట్ వ్యాపార పరంగా మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వర్తక సంఘం నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






