17 June, 2026 | 10:58 PM

ప్రతి కళాకారుడికి... ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేస్తుంది

17-06-2026 09:33 PM

సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి

జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రతి కళాకారుడికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేస్తుందని ఎవరు ఆందోళన చెందవొద్దని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసినందుకు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డిని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మండలి సభ్యుడు పల్లె నరసింహ తో కలిసి కళాకారుల బృందం తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారులు రవీంద్రభారతిలో డైరెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం సాంస్కృత శాఖ సంచాలకు ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ ఈరోజు నుండి గుర్తింపు కార్డుల ప్రక్రియ జారి ప్రారంభమైందని దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి కళాకారునికి గుర్తింపు కార్డు ఇచ్చే విధంగా ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజానాట్యమండలి మేడ్చల్ జిల్లా కార్యదర్శి వెంకటాచారి, అధ్యక్షురాలు ప్రమీల, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు నళిని, కార్యదర్శి సైదులు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కూన సుధాకర్, కార్యదర్శి రాములు, కళాకారులు అడివయ్య, రామస్వామి, అరుణ్ కుమార్, జోసెఫ్, భాను తదితరులు పాల్గొన్నారు.