జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి
24-06-2024 12:50 PM
హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఉన్న రొనాల్డ్ రోస్ విద్యుత్ శాఖ కార్యదర్శి బదిలీ అయ్యారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా రోనాల్డ్ రోస్ కు అదనపు బాధ్యతలను అప్పగించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి నియామకం అయ్యారు. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ కుమార్, దేవదాయ శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్, కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్స్ పల్ సెక్రటరీగా రిజ్వీ, జీహెచ్ఎంసీ ఈవీడీఎమ్ కమిషనర్ గా ఏవీ రంగనాథ్, హెచ్ఎండీఎ కమిషనర్ గా సర్ఫరాజ్ అహ్మద్, కరీంనగర్ కలెక్టర్ గా పమేలా సత్పతి నియామకం అయ్యారు.






