తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ అయ్యారు. రాష్ట్రంలో 42 మంది ఐఏఎస్ లు, ఇద్దరు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పశుసంవదర్ధకశాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్వసాచి ఘోష్, నియామకం అయ్యారు. కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్, చేనేత, హస్తకళల ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్య, హ్యాండ్లూమ్స్, టీజీసీవో హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎండీగా శైలజకు అదనపు బాధ్యతలు, అటవీ, పర్యావరణ శాఖల ముఖ్యకార్యదర్శిగా అహ్మద్ నదీమ్, టీపీటీఆర్ఐ డీజీగా అహ్మద్ నదీమ్ కు అదనపు బాధ్యతలు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్ సుల్తానియా, ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్ సుల్తానియాకు అదనపు బాధ్యతలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా సందీప్ కొనసాగనున్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ ముఖ్యకార్యదర్శిగా రిజ్వి, జీఏడీ ముఖ్యకార్యదర్విగా సుదర్శన్ రెడ్డిని నియమించారు.






