30 July, 2026 | 11:57 AM

సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట

24-06-2024 01:14 PM

న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చిలో అరెస్టు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు సోమవారం వాయిదా వేసింది. ఇప్పుడు ఈ కేసు జూన్ 26న విచారణకు రానుంది. ఈ అంశంపై హైకోర్టు ఉత్తర్వులు వెలువడే వరకు వేచి చూడాలని న్యాయమూర్తులు మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన వెకేషన్ బెంచ్ పేర్కొంది. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఈడీ సవాల్ చేసింది. కిందికోర్టు ఆదేశాల అమలుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.