14 May, 2026 | 1:43 AM

కడ్తాలలో ఏసీపీ కార్యాలయం, ట్రాఫిక్ పీఎస్ ఏర్పాటు చేయాలి

14-05-2026 12:35 AM

డీజీపీకి లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి విన్నపం

కడ్తాల్, మే13(విజయక్రాంతి): కడ్తాల్ మండల కేంద్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఏసీపీ కార్యాలయం, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి రాష్ట్ర డీజీపీని కోరారు. బుధవారం హైదరాబాద్లో డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కడ్తాల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏసీపీ కార్యాలయం అవసరమని పేర్కొన్నారు. శ్రీశైలం జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల, ప్రమాదాల నివారణకు ప్రత్యేక ట్రాఫిక్ పీఎస్ మంజూరు చేయాలని కోరారు.దీనిపై డీజీపీ సానుకూలంగా స్పందించారని, ఈ అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి వెల్లడించారు.