విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎంఆర్
06-07-2026 01:53 AM
అమీన్పూర్, జూలై 5: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని నూతన దేవాలయ అభివృద్ధికి.. నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం బీరంగూడ డివిజన్ పరిధిలోని లక్ష్మీ సాయి మెడోస్ కాలనీ పోచమ్మ దేవాలయం, ఎన్‌ఎస్‌ఎల్ కాలనీ వినాయక దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవంతుని కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, ప్రమోద్ రెడ్డి, లింగం గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.






