30 March, 2026 | 2:17 AM

అమ్మకు అక్షరమాల ఉల్లాస్

30-03-2026 12:38 AM

కామారెడ్డి, మార్చి 29 (విజయక్రాంతి): అమ్మకు అక్షరమాల ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఎన్ ఐ ఓ ఎస్, ప్లానెట్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసినట్లు డిఆర్డిఏ పిడి సురేందర్ తెలిపారు. జిల్లాలో 16,331 మంది అభ్యసకులు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

పరీక్షల నిర్వహణకు 5266 మంది డిఆర్డిఏ సెర్ప్ సిబ్బంది నీ ఇన్విజిలేటర్ గా  నియమించినట్లు తెలిపారు. అదన ప్రాజెక్టు అధికారి విజయలక్ష్మి, డిపిఎంలో జిల్లా ప్రాజెక్టు అధికారి జిల్లాలోని ఏపీ ఎం లు, ఎంఈఓ లు, డి ఆర్ డి ఎ సెర్ప్ సిబ్బంది పర్యవేక్షించారు. అధికారులు పరీక్షలు నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బంది కృషిని అభినందించారు. వయోజనులలో అక్షరాస్యత పెంపొందించడంలో ఈ కార్యక్రమం కీలకపాత్ర పోషిస్తుందని డిఆర్డిఏ పిడి సురేందర్ తెలిపారు.