వర్నిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం
బాన్సువాడ, మార్చి 29 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి బి విట్టల్ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు విగ్రహం వద్ద టీడీపీ జెండా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ఎన్టీ రామారావు 1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారం లోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీ రామారావు దేనని ఆయన పేర్కొన్నారు. పేదల కోసం 2 రూపాయలు కిలో బియ్యం, పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి మండల వ్యవస్థని తీసుకొచ్చారు. పేద వారికి పక్క ఇళ్లు, జనతా వస్త్రాలు, ఆడ వారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించారనీ ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బి.వినోద్ చౌదరి, మార్ని రాజారావు, గుణసుందరి, వెంకటేశ్వరరావు, మద్దిపూడి శ్రీనివాస్, కృష్ణ ప్రసాద్, కనక రాజు, సత్యనారాయణ, N. శ్రీనివాస్, వీర్రాజు, కౌశిక్ సాయిలు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.




