‘నై’రుతి..!
- వర్షాలు పడకుంటే పొలాలు బీడ్లు
జూన్ ప్రారంభమైనా జాడలేని వానలు
చెరువుల్లో నిండుకున్న నీటి నిల్వలు
ఆయకట్టు రైతుల్లో ఆందోళన
నిర్మల్, జూన్14 (విజయక్రాంతి): వానకాలం మొదలైంది. నిర్మల్ జిల్లాలో చిరు జల్లులు తప్ప జోరువానలు లేవు. మృగశిర కార్తె ప్రారంభంమై వారం రోజులు గడుస్తున్న వాతవరణంలో మార్పులు తప్ప వాన చినుకు జాడ లేక పోవడంతో రైతన్న లు గ ఆందోళనకు చెందుతున్నారు .చెదురు మొదురు వర్షాలు తప్ప సాదరణ వర్షం కురువడం లేదు. వ్యవసాయ భూమి తడువక పోవడంతోవర్షాలు కురిస్తే తప్ప ఖరీఫ్ కు ముందుకు సాగే పరిస్థితి కన్పించడం లేదు.ఇక ప్రాజెక్టు విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో ప్రదాన ప్రాజెక్టుల్లో నీరు డెడ్ స్టోరేజీకి చేరుకోవడం రైతులను మరింత కలవరంనకు గురి చేస్తుంది.జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులైన శ్రీరాంసగర్ సరస్వతీ కెనాల్, గడ్డెన్న వాగు, స్వర్ణ. సదర్ మాట్, కడెం ప్రాజెక్టు 643 చెరువుల్లో నీళ్లు లేక పోవడంమే కారణం.
శ్రీరాంసాగర్ పాజెక్టు నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం1 056 అడుగులు ఉంది.(90 టీఎంసీకు 7.57 టీఎంసీలు మత్రమే) కడెం 700అడుగులకు గాను 671 అడుగులు (7.603 టీఎంసీలకు గాను2.365 టీఎంసీలు)స్వర్ణ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం1183 అడుగులకు గాను1167 అడుగులు(1.484 టీఎంసీలకు గాను0.393 టీఎంసీలు) గడ్డెన్న వాగు 358.70 అడుగులకు గాను 355.90 అడుగులు(1.852 టీఎంసీలకు గానుఏ.733 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సదర్ మాట్, పల్సిరంగారావుకర్, సీరాల ప్రాజెక్టుల్లో నీళ్ళు లేక బోసిపో యి ఉన్నాయి. నీటి పారుదల శాఖ చెరువులు మొత్తం 643 ఉండగా 450 చెరువులోనీటి నిల్వలో 20 శాతం నీళ్లు మాత్రమే ఉండగా మిగితా చెరువుల్లో 30 శాతం లోపు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
గత ఎడాదితో పోలీస్తే అన్ని వనరుల్లో నీటి నిల్వలు తగ్గడం అందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఇదే సీజన్‌లో శ్రీరాంసాగర్ 1065.కడెంలో 776.స్వర్ణలో1172గడ్దెన్న వాగు ప్రాజెక్టు లో 354 ఉడుగులు నీరు ఉందని అధికారులు వివరించారు. చెరువుల విషయానికి వస్తే 30శాతం నుండి 45 వాతం నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.జూన్ మా సంలో కరిసిన వర్షాలకు చెరువుల్లో కి కొత్త నీరు వచ్చేది. జులైలో పూర్తి స్థాయిలో వానకాలం సాగుకు నీరు విడుదల చేసేవారు. అయితే ఈ సంవత్సరం ఇప్పటి వరకు వర్షాలు కురవక పోవడంతో చెరువు, ప్రాజెక్టుల్లో చుక్క నీరు రాకపోవడంతో ఆయకట్లు రైతులు అం దోళన చెందుతున్నారు. చెరువులు ప్రాజెక్టుల క్రింద వరి సాగు చేసే రైతులకు వరినారు సైతం వేసుకొనే పరిస్థితి లేకపోవడంతో రైతులు వర్షాలకోసం ఎదురు చూస్తున్నారు. వానలు ఆలస్యంగా కురిస్తే పంటల సాగు ఆలస్యం అయి దిగుబడులపై ప్రభావం ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వానలు పడితేనే రైతుల్లో మురిపెం
నిర్మల్ జిల్లాలో ఈ నెలాఖరు వరకు వర్షాలు కురిసి చెరువులు, ప్రాజెక్టుల్లోకి నీరు చేరితేనే ఆయకట్టుకు సాగుకు భరోసా ఏర్పడనుంది. శ్రీరాంసాగర్ సరస్వతీత కెనాల్ కింద సోన్, నిర్మల్, లక్ష్మణచాంద, మామడ, దిలావర్‌పూర్, ఖానాపూర్, నిర్మల్ రూరల్ మండలంలోని 36వేల ఎకరాలకు స్వర్ణ ప్రాజెక్టు ద్వారా 42వేల ఎకరాలు, కడెం ప్రాజెక్టు కింద 55వేల ఎకరాలు, గడ్డెన్న వాగు ప్రాజెక్టు కింద 22వేల ఎకరాలు, సదర్‌మాట్ కింద 20వేల ఎకరాలు పంటలు సాగవుతున్నాయి. దీంతో పాటు సాగునీటి చెరువుల కింద మరో 50వేల ఎకరాల వరకు వరి పంటను పండిస్తారు. వర్షాలు కురిసి చెరువులు, ప్రాజెక్టులు నిండితేనే ఖరీఫ్‌లో వరిసాగుకు మోక్షం ఉండడంతో ప్రస్తుత పరిస్థితిలో వర్షాలు లేక చెరువుల్లో, ప్రాజెక్టుల్లో నీరు రాక బోసిపోయి కనిపిస్తున్నాయి.
వాతావరణ శాఖ వర్షాలు కురుస్తాయని చెప్పినా జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో చిరుజల్లులు తప్ప భారీ వర్షాలు కురవకపోవడం రైతుల పంటల సాగుకు ఆటంకం కలుగుతోంది. గత సంవత్సరం ప్రాజెక్టులన్నీ జూన్, జూలై మాసంలోనే కురిసిన వర్షాలకు నిండిపోగా ఆ తర్వాత అక్టోబర్ వరకు వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులు, చెరువుల్లో ఉన్న నీరు ఖాళీ అయినపోయినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ వరకు వర్షాలు కురిస్తే ఈ ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి నిల్వ శాతం పెరిగేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం అటు రైతులను అధికారులను ఆందోళనకు గురిచేస్తోం ది. ఇప్పటికైనా వానదేవుడు కరుణించి వర్షా లు కురిపించి చెరువులు, ప్రాజెక్టులు నింపితేనే అటు రైతులకు, ఇటు పశువులకు నీటి కష్టాలు పోతాయి.
దీనికి తోడు మిషన్ భగీరథ ద్వారా శ్రీరాంసాగర్, గడ్డెన్నవాగు, కడెం ప్రాజెక్టు నుండి జిల్లాలోని 613 ఆవాసాలకు ప్రతీరోజు స్వచ్ఛమైన నీరును సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వలు పడిపోవడంతో మిషన్ భగీరథ నీటి సరఫరా కూడా ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే మిషన్ భగీరథ పంపుల వద్ద నీరు లేకపోవడంతో అధికారులు కాల్వల ద్వారా పంపులకు నీటిని మళ్ళించి శుద్ధ జల ప్లాంట్లకు పంపిస్తున్నారు. మృగశిర కార్తె ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో వానదేవుడు కరుణపైనే ఆయకట్టు సాగు ఆధారపడి ఉండడంతో రైతన్నలు వర్షాలు కురవాలని గ్రామాల్లో పూజలు చేస్తున్నారు.
చెరువుల్లో నీరు లేదు
చెరువుల్లో నీళ్లు లేవు. వానాకాలం ప్రారంభమై 15 రోజులైతాంది. చిరుజల్లులు తప్ప పెద్ద వర్షాలు లేవు. చెరువులు నిండితేనే పంటలు. లేకుంటే లేదు. దుక్కులు దున్ని రెడీగా ఉన్నయ్. వర్షాలు లేక నారు పోస్తలేం. చెరువు కింద 2 ఎకరాల పొలం ఉంది. అదే మా కుటుంబా నికి ఆధారం. వానదేవుడు కరుణించాలే. సమయానికి వర్షాలు పడి అందరం బాగుండాలె.
మైనోద్దిన్, రైతు, ఓల
వరి నారు వేయలేకపోతున్నం
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండితేనే వరి పొలాలకు నీళ్లు. ప్రాజెక్టులో ఈ సంవత్సరం 7.648 టీఎంసీల నీరే ఉందట. పంటలకు విడుదల చేసే అవకాశం లేదట. మహారాష్ట్రలో వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండితేనే వరిసాగుకు భరోసా . ప్రస్తుతం కాల్వ కింద వర్షాలు లేక ప్రాజెక్టులో నీరు రాక వరినారు సైతం వేసుకోలేని పరిస్థితి. వానదేవుడు కరుణించి వర్షాలు కురిపించి మమ్మల్ని కాపాడతారని ఎదురుచూస్తున్నాం.
మల్లయ్య, రైతు, గంజాల్






