ఎన్నో ప్రశ్నలు మిగిల్చిన ఎన్నికలు
రాష్ట్రంలో జరిగిన కరీంనగర్ అదిలాబాద్, మెదక్,నిజామాబాద్ పట్టభద్రుల, టీచర్ల ఎన్నిక అనేక సందేహాలను ,అనేక ప్రశ్నలను ఉత్పన్నం చేసింది. మేధావులుగా చలామణి అవుతున్న, సమాజ నిర్మాతలుగా పేర్కొనే ఉపాధ్యాయులు, లెక్చరర్లు సైతం ఓటుకు విలువ కట్టి పోటీ పడి డబ్బులు తీసుకున్నారంటూ వాట్సప్ సమూహాల్లో వివిధ రూపాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఓటు విలువను బోధించే బోధకులే అంతరాత్మ ప్రబోధం కాకుండా ప్రలోభాలకు లోనై అమ్ముకున్నట్టు, ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం కార్పొరేట్ వైపు మొగ్గు చూపినట్టు ఫలితాలు విస్ప ష్టం. రెండవ కారణం సమాజంలోని అత్యధిక శాతం బీసీలు ఉన్నారు. ఐక్యత అంటూ ఊద రగొట్టి చెప్పారు కానీ బీసీ ఐక్యతపై సవాలక్ష సందేహాలు సమాధానాలు దొరకని ప్రశ్నలు గానే మిగిలి పోయాయి.
పేరుకు, పోరుకు పట్టభద్రులు, ఉపాధ్యాయులు కానీ వేల సంఖ్యలో ఓట్లు వృధా. నిరక్షరాస్యులు సైతం ఓటు హక్కును వినియోగించుటలో పరిణతిప్రదర్శిస్తే మేధావి సమాజం మన నిర్మిత వ్యవస్థలపై పరిజ్ఞానం లేకపోవడం ఒకింత ఆలోచించవలిసిందే.
ఉమాశేషారావు వైద్య,కామారెడ్డి






