24 April, 2026 | 3:06 PM

Breaking News

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి   •   అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   ఉపాధి హామీ పని గంటలను తగ్గించండి   •   ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య   •   అభివృద్ధికి సహకరించండి... ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం   •   డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి   •   బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి   •   ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి   •   ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతూ సంఘీభావం తెలిపిన బీఎస్పీ నాయకులు   •  

అధికార పార్టీ స్వయంకృతం

09-03-2025 12:00 AM

ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో  అధికార కాంగ్రెస్ పార్టీ స్వయంకృత ఆపరాధం వల్లే పట్టభద్రుల స్థానం లో ఓటమి చెందింది.. విద్యారంగం, ఉపాది రంగాల్లో  గత సంవత్సరం కాలంలో అనేక మార్పులు జరిగినా చేసిన అభివృద్ధిపై సరైన ప్రచారం చేసుకోలేదు. లబ్ధి పొందిన ఆయా వర్గాలవారు కూడా మార్పును త్వరగా మర్చిపోయారు.

ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రస్తుత సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల శుభ్రతకు, ఇతర పనులకు స్కావేంజర్ వ్యవస్థ ఏర్పాటు చేసింది. ప్రతి రోజు పరిశుభ్రత ఉండే విధంగా చూస్తున్నారు. అనేక సంవత్సరాలు పెండింగ్‌లో ఉన్న టీచర్ ప్రమోషన్స్ ద్వారా 15 వేల మంది కి పదోన్నతి కల్పించారు.

కొత్త ప్రభుత్వం రాగానే 11062 టీచర్ పోస్టులు భర్తీ చేశారు.. గత ప్రభుత్వ హయాంలోని పెండింగ్ ఉద్యోగాలు కొత్త ప్రభుత్వం త్వరగా పూర్తి చేశారు,బదిలీలు పూర్తి చేశారు.. ఈ అంశాలు బలంగా చెప్పుకోకపోవడంవల్ల  ప్రభుత్వానికి నష్టం జరిగింది. 

 రావుల రామ్మోహన్ రెడి,్డ జనగాం