24 April, 2026 | 6:10 PM

Breaking News

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ మందుల నాగయ్య   •   ఇంటి ఆవరణ పరిశుభ్రతే... దోమల నివారణకు ఉత్తమ మార్గం   •   బిచ్కుంద మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక నోటిఫికేషన్ విడుదల   •   అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   •   ఆర్టీసీ కార్మికుడి మృతి ప్రభుత్వ హత్యగా భావించాలి   •   కాసిపేట 1A గని మ్యాన్ రైడింగ్ ప్రారంభించిన వేకటేశ్వర్లు, డైరెక్టర్ (ప్రాజెక్టు&ప్లానింగ్)   •   బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   చదువుతోపాటు సంస్కారం అవసరం   •   ఖమ్మంలో పలువురికి ఎంపీ రవిచంద్ర పరామర్శ   •  

మగువా..నీ తెగువకు సలాం!

08-03-2025 12:00 AM

వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలు

నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్ గు రించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లే దు. భారతదేశ ఆర్థికమంత్రి గా నిర్మలమ్మ అందరికీ సు పరిచితురాలే. వరుసగా ఎని మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డు నెలకొల్పా రు. ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఉన్నా ఆయన వరుసగా ప్రవేశపెట్టలేదు. కానీ, నిర్మలమ్మ మాత్రం ఇప్పటికే ఎనిమిది పర్యాయాలు భారత పద్దును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి రికార్డు నెలకొల్పారు.

నీతా అంబానీ

నీతా అంబానీ గురించి చాలామందికి తెలుసు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ సతీమణిగానేకాక పలు సేవా కార్యక్రమా లు చేస్తూ పలువురికి ఆదర్శం గా నిలుస్తున్న వ్యక్తిగానూ అం తా ఆమెను గుర్తుపెట్టుకుంటారు. రిలయన్స్‌కు మొట్టమొదటి వుమెన్ డైరెక్టర్‌గా రికార్డులకు ఎక్కిన నీతా ఇక అప్పటి నుంచి వెనక్కు తిరిగి చూడలేదు. దాతృత్వంలో నీతా అంబానీని మించిన వారు వేరొకరు లేరనవచ్చు. ఎన్నో ఎన్జీవోలకు ఆమె సాయం చేస్తున్నారు.

సునీతా విలియమ్స్

వ్యోమగామి సునీతా విలియమ్స్ గురించి తెలియని వారుండరు. ఏడాది కాలం గా సునీత విషయమై అంతా తెగ ఆరాలు తీస్తున్నారు. కారణం, ఆమె అంతరిక్షంలో చిక్కుకు పోవడమే. ఇప్పటికే అనేకసార్లు నింగిలోకి వెళ్లి వచ్చిన సునీత, 2024 జూన్‌లో నింగిలోకి వెళ్లారు. కానీ, అనుకోని కారణాలవల్ల ఆమె అక్కడే ఉండాల్సి వచ్చింది. నెలలు గడుస్తున్నా ఆమె ఏ మాత్రం ఆత్మనిబ్బరం కోల్పోలేదు. మరికొద్ది రోజుల్లో సునీతను భూమికి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అరుంధతీ భట్టాచార్య

ప్రముఖ బ్యాంకర్ అయి న అరుంధతీ భట్టాచార్య భా రత్‌లో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆ ఫ్ ఇండియాకు చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. స్టేట్ బ్యాంక్‌కు అరుంధతి తొలి మహిళా చైర్‌పర్సన్ కావడం విశేషం. భారత స్టీల్ సిటీలో బాల్యాన్ని గడిపిన భట్టాచార్య ఉక్కుమనిషిలా మారి, దేశ ఆర్థిక రంగంలో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ఆమె రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో నాన్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిసున్నారు.

రష్మిక మందన్న

ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేరు రష్మిక మందన్న. 2016లో ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ చిత్రంతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ నాగశౌర్యతో కలిసి ‘ఛలో’ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. సెట్‌లో అడుగుపెడితే రూ.1000 కోట్లు, రూ.500 కోట్లకు తగ్గేదే లేదంటోందీ బ్యూటీ. స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్‌గా మారి, అభిమానుల గుండెల్లో నేషనల్ క్రష్‌గా తిష్ట వేసింది.

మేరీ బర్రా(జనరల్ మోటార్స్ సీఈవో)

అమెరికా మహిళా వ్యాపారవేత్త మేరీ బర్రా ప్రస్తుతం జనరల్ మోటార్స్ సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచిన జనరల్ మోటార్స్‌కు ఆమె మొదటి మహిళా సీఈవో. మేరీ బర్రా 1980 నుంచే జనరల్ మోటార్స్‌లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. ఈమె ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. 18 ఏండ్ల ప్రాయంలోనే మేరీ జనరల్ మోటార్స్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.

వైశాలి. ఆర్(చెస్)

తమిళనాడుకు చెందిన వైశాలి పేరు చదరంగం అభిమానులకేకాక సాధారణ జ నానికీ తెలుసు. భారత 84వ గ్రాండ్ మాస్టర్‌గా 2023లో ఆవిర్భవించిన వైశాలి ఆటలో తన మార్క్ చూపెడుతోంది. ఓ మధ్యతరగతి టీఎన్‌ఎస్‌సీ బ్రాంచ్ మేనేజర్ ఇంట్లో జన్మించిన వైశాలి తన ప్రతిభను చాటుతోంది. పువ్వు పుట్టగానే పరిమలిస్తుందనే చందాన వైశాలి పన్నెండేళ్ల ప్రాయంలోనే ‘వరల్డ్ యూత్ చెస్ చాంపియన్‌షిప్’ను నెగ్గింది. ప్రస్తుతం వైశాలి 2484 ఫిడే రేటింగ్ పాయింట్లతో కొనసాగుతోంది. 

ఉర్సులా వాన్ డర్(బెల్జియం)

అగ్రరాజ్యం అమెరికా పెత్తనం తగ్గించేందుకు యు రోపియన్ యూనియన్ దే శాల సమాఖ్య ఏర్పడింది. ఈ సమాఖ్యకు ప్రస్తుతం ఉర్సు లా వాన్ డర్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. జర్మనీకి చెందిన రాజకీయ నాయకురాలు. ప్రభుత్వంలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. బెల్జియంలో జన్మించిన ఉర్సులా జర్మనీలో రాజకీయ నాయకురాలిగా తనదైన ముద్ర వేశారు. ఆడవారు కేవలం పిల్లల్ని కనేందుకు, వంటలు చేసేందుకే అని భావించే సమాజానికి ఉర్సులా గట్టి సమాధానం చెబుతోంది.

స్మృతి మంధాన

ఈ పేరు గురించి తెలియని వారు దాదాపు ఎవ రూ ఉండరు. ముంబైలో జన్మించిన మంధాన ప్రస్తు తం ‘భారత మహిళా క్రికెట్‌లో ఓ ఆశాకిరణం’. వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరుకు మొదటి టైటిల్ అందించి కన్నడ వాసుల కలను నెరవేర్చింది. ఈ ఏడు బీసీసీఐ అందజేసిన అవార్డుల్లో బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్  ఆమె ఎంపికైంది. ఓపెనర్‌గా బరిలోకి దిగే మంధాన ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా మారుతోంది. 

క్లాడియా(మెక్సికో రాజకీయనాయకురాలు)

అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగాఅమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వార్తల్లో మెక్సికో పేరు ఎక్కువగా కనిపిస్తోంది. ట్రంప్ సుంకాల ప్రకటనకు ఏ మాత్రం భయపడకుండా మెక్సికో సమాధానం చెబు తూ వస్తోంది. ట్రంపరితనానికి తగిన సమాధానం మెక్సికో చెప్పడంలో ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియాది కీలకపాత్ర. మెక్సికో దేశానికి 66వ అధ్యక్షురాలిగా ప్రస్తుతం క్లాడియా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈమె  ప్రముఖ శాస్త్రవేత్త కూడా. 

టేలర్ స్విప్ట్(మ్యుజీషియన్)

అమెరికా ప్రముఖ పాప్ సింగర్ టేలర్ అలీసన్ స్విఫ్ట్ చాలామందికి సుపరిచితురా లు. ఇప్పటికే ఎన్నో సూపర్‌హిట్ ఆల్బమ్స్ చేసిన స్విఫ్ట్ గాత్రానికి సంగీత లోకం దా సోహమంటోంది. ఆమె పా టలు పాడటం మాత్రమేకాక నటిగానూ అలరిస్తోంది. ప్రదర్శనలు ఇస్తూ టేలర్ కుర్రకారును ఉర్రూతలూగిస్తుంది. తాము అభివృద్ధి చెందుతూ తోటి వారినికూడా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మహిళలందరూ మహారాణులే. 

గీతా గోపీనాథ్(ఐఎంఫ్ డిప్యూటీ ఎండీ)

ఇండో అయిన గీతా గోపీనాథ్ ప్రముఖ మహిళా ఆర్థికవేత్త. ప్రస్తుతం ఆమె అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2019 2022 మధ్య కాలంలో ఆమె ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తగా సేవలందించారు. ఐఎంఎఫ్‌లో జాయిన్ కాకముందు గీత ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని ఆర్థికశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. 

అవరోధాలను అధిగమించి..

మనం ఎంచుకున్న లక్ష్యాన్ని, చేసే పనిని ఇష్టపడితే అందులో కష్టం అనేదే ఉండదని జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ముక్క గీతా ఇంద్రనీల్ అన్నారు. ఉన్నత చదువులు చదవడానికి కాన్వెంట్ స్కూళ్లు, కార్పొరే ట్ కాలేజీలు అక్కర్లేదని, లక్ష్య సాధనకు ఆర్థిక ఇబ్బందులు, రిజర్వేషన్లు అడ్డుగోడలు కావని నిరూపించి, తాను అనుకున్నది సాధించిన మహిళామణి డాక్టర్ గీత.

పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుత సిరిసిల్ల జిల్లా) ఎల్లారెడ్డిపేట మండలం మారుమూల ప్రాంతం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని ఓ మామూలు వ్యాపారి కూర నారాయణ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె జీవితం ఎందరో యువతీ యువకులకు ఆదర్శం. ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన తన తోటి మెడికో విద్యార్థులతో ప్రతి రోజు ఇంగ్లీషులో మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషపై పట్టు పెం చుకొని మెడిసిన్ పూర్తి చేశారు.

ఆ రోజుల్లో పీజీ జనరల్ ఫిజీషియన్ అంటే కేవలం మగవాళ్లే చేసే కోర్స్ అది. అందరూ వింతగా చూసినా, ‘ఆడవాళ్లు ఈ ఎమర్జెన్సీ కేసులు చేస్తారా?’ అని ప్రశ్నించినా మొక్కవోని విశ్వాసంతో ధైర్యంగా పీజీలోనూ టాపర్‌గా నిలిచారామె. ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ ముక్క ఇంద్రనీల్‌తో పెళ్లి కాగానే గత దశాబ్ద కాలంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో మనోవరి ఆసుపత్రి స్థాపించి వైద్యసేవలు అందిస్తున్నారు. 

విజయక్రాంతి, జగిత్యాల ముత్యాల పలుకు

విద్య లేని స్త్రీ వేర్లు, ఆకులు లేని మర్రిచెట్టు లాంటిది. ఆమె తన పిల్లలను పోషించుకోలేదు. స్వయంగా జీవించనూ లేదు. విద్య గొప్ప సమానత్వం కలిగిస్తుంది. అది మనలను మన గుహలనుంచి బయటకు తీసుకు వెళుతుంది. ప్రతి వ్యక్తికీ అవకాశాల ద్వారాలను తెరిచే కీలక అవకాశం విద్య. స్వావలంబనకు విద్య ఒక్కటే మార్గం.

 సావిత్రీ బాయి ఫూలే 

పరుగుల రాణి

పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిది ఏమి లేదని ఆచరణలో నిరూపించారు ప్రభుత్వ పాఠశాల పీఈటీ కొర్సా నాగలక్ష్మి. చిన్నతనం నుంచి ఆటలపై ఉన్న మక్కువ ఆమెకు క్రీడల రాణిగా పేరు తెచ్చిపెట్టింది. అథ్లెటిక్స్‌లో తన ప్రతిభను చాటుతూ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగి అధికారులు, ప్రజాప్రతినిధుల మన్ననలు పొందుతున్నారామె. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజక వర్గం పరిధిలోని ములకలపల్లి మండలం చండ్రుకుంట అనే  కుగ్రామంలో జన్మించిన కొర్సా నాగలక్ష్మి చిన్నతనం నుంచే ఆటలపై మక్కువ పెంచుకొంది. అదే ఆమెను ప్రభుత్వ పీఈటీగా స్థిరపడేలా చేసింది. టేకులపల్లి మండలం బేతంపుడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తోంది.

ఆటలతో శారీరక దారుఢ్యం, మానసిన ఉల్లాసం సంక్రమిస్తుందని, ప్రతి బాలిక చిన్నతనం నుంచి తనకు ఇష్టమైన ఆటపై మక్కువ పెంచుకోవాలని ఆమె సూచించారు. మారుమూల గిరిజన గ్రామంలో కడుబీద కుటుంబంలో జన్మించిన నాగలక్ష్మి ఎంతో ఇష్టంతో ఎంత కష్టమైనా ఉన్నత చదువులు చదివి తనకు ఇష్టమైన క్రీడారంగంలో స్థిరపడి, నేటి బాలికలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 

 భద్రాద్రి కొత్తగూడెం, ‘విజయక్రాంతి’