17 July, 2026 | 9:09 PM

Breaking News

మైనార్టీ గురుకుల ఉద్యోగులపై జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ. రూ.5.62 లక్షల ఫైన్   •   రోగుల సేవలకు మరింత బలం   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ నైపుణ్యాలతో ఉపాధి పెరుగుతుంది   •   సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •  

బూత్ స్థాయిలో విస్తరణకు కసరత్తు

27-08-2024 02:14 AM

బీజేపీ సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీజేపీని బూత్ స్థాయి నుంచే విస్తరించేందుకు పార్టీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు కదులుతోందని బీజేపీ సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ తెలిపారు. వికసిత్ భారత్ 2047  లక్ష్యా నికి అనుగుణంగా జాతీయ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని విస్తరించేలా పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన వివిధ మోర్చాల సమావేశంలో ఆయన ప్రసంగించారు. 

రాష్ట్రంలో చేపట్టను న్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు అత్యంత క్రియాశీలకంగా పనిచేయాల ని పిలుపునిచ్చారు. జిల్లా, మండల స్థాయిలో కార్యశాలలు నిర్వహిస్తూ కార్యకర్తలకు సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించేలా ఆయన దిశానిర్దే శం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు,  వివిధ మోర్చాలు, అనుబంధ విభాగాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.