10 June, 2026 | 3:53 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

ఆకట్టుకునే థ్రిల్లర్.. కిల్లర్

24-02-2026 12:16 AM

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా ‘కిల్లర్’. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి ఏ నిర్మిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ ఈవెంట్‌లో హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ.. “నేను సీరియల్స్‌లో రొటీన్ క్యారెక్టర్స్ చేస్తూ విసిగిపోయి ఉన్న టైమ్‌లో డైరెక్టర్ సుకు పూర్వజ్ నన్ను స్క్రీన్ మీద కొత్తగా చూపించేందుకు ముందుకొచ్చారు. ఆరేడు క్యారెక్టర్స్ ఉన్న ఇలాంటి మూవీ చేస్తానని అనుకోలేదు. విజయశాంతిలా యాక్షన్ చేయాలని నాకూ డ్రీమ్ ఉండేది. ఈ సినిమాలో నాతో యాక్షన్ కూడా చేయించాడు డైరెక్టర్. పెళ్లయ్యాక చాలా మంది పర్సనల్ వెకేషన్‌కు వెళ్తారు.

కానీ మనం సినిమా చేద్దామని పూర్వాజ్ నాతో అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది” అన్నారు. డైరెక్టర్ సుకు పూర్వాజ్ మాట్లాడుతూ.. “ఐదారేళ్ల కిందట అనుకున్న స్క్రిప్ట్ ఇది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ డ్రామా, బ్రదర్ సిస్టర్ బాండింగ్, రివేంజ్, సబ్ కాన్షియస్ ఐడెంటిటీ.. ఇలాంటి ఎలిమెంట్స్‌తో సైఫై థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించాం. మల్టీలేయర్ స్క్రీన్ ప్లే ఉన్నా ప్రతి సెక్షన్ ప్రేక్షకులకు ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిగతా చిత్రబృందం కూడా మాట్లాడారు.