10 June, 2026 | 3:00 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

ఫిల్మ్ క్రిటిక్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

24-02-2026 12:15 AM

తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం సోమవారం ఎన్నికైంది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్, ఉపాధ్యక్షులుగా సీనియర్ ఫోటోగ్రాఫర్ ఈ జనార్దన్‌రెడ్డి, ఎండీ అబ్దుల్, ప్రధాన కార్యదర్శిగా సురేశ్ కొం డేటి, సంయుక్త కార్యదర్శులుగా పర్వీన్, భాగవతుల మురళి, కోశాధికారిగా చదలవాడ భరద్వాజ ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు.

ఈసీ మెంబర్లుగా గిరిధర్, నరసింహ, సాయిరమేశ్, ప్రకాశ్, అప్పాజీ, నవీన్, గోరంట్ల రవి, కుమార్, జీ సురేశ్, శ్యామ్, చందు రమేశ్, టీ కేశవాచారి తదితరులను ఎన్నుకున్నారు. సీనియర్ సభ్యులు బాలిరెడ్డి, లక్ష్మణ్‌రావు, గొటేటి మోహన్ తదితరుల నేతృత్వంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సమావేశంలో మాజీ కార్యదర్శి లక్ష్మీనారాయణ, సీనియర్ సభ్యుడు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.