10 April, 2026 | 7:22 PM

Breaking News

దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •   ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కోసం సిపిఐ పోరాటం...   •  

‘మా’ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం

24-02-2026 12:18 AM

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) నూతన డైరీని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  సోమవారం ఆవిష్కరించారు. ‘మా’ సభ్యుల కోసం చేపడుతున్న ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, హెల్త్ చెకప్‌లు, సభ్యుల సంక్షేమం కోసం కార్యవర్గం చేపడుతున్న కార్యక్రమాలను అధ్యక్షుడు విష్ణు మంచు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు వివరించగా, ఆయన అభినందించారు. ప్రజాభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ‘మా’ ఉపాధ్యక్షుడు మాదాల రవి, కోశాధికారి శివ బాలాజీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు జయవాణి, మలక్‌పేట్ శైలజ, శివనారాయణ, శశాంక్, హరనాథ్‌బాబు, మానిక్, సంపూర్ణేశ్‌బాబు, ఎంఆర్‌సీ వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు.