12 June, 2026 | 2:31 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

వినూత్నంగా విలేజ్ క్యాబినెట్

28-01-2026 07:39 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో సర్పంచి గుంటి రేణుక వెంకట్ విలేజ్ క్యాబినెట్ ఏర్పాటు చేశారు. గ్రామ సమస్యలు, అభివృద్ధి పరిష్కరించేందుకు, సేవలు అందించేందుకు అవసరానికి అనుగుణంగా పలు శాఖలు 12 మంది వార్డు సభ్యులకు కేటాయించారు.

విద్యుత్, పాఠశాల విద్యా, వైద్యరోగ్యం, పంచాయతీరాజ్, రోడ్లు, పౌరసరఫరాలు, మహిళా సంక్షేమం, శిశు సంక్షేమం, అంగన్వాడీ, నీటిపారుదల, మత్స్య సంపద, కార్మిక ఇతర శాఖలను ఏర్పాటు చేశారు. అనంతరం సర్పంచ్ రేణుక వెంకట్ మాట్లాడుతూ... గ్రామంలోని పలు సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఈ శాఖలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలోని ప్రజలు సర్పంచి తీసుకున్న నిర్ణయానికి, మేము సహకరిస్తామని, ఎంతో ఆనందదాయకంగా ఉందని, రానున్న రోజుల్లో మా గ్రామాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోయే విధంగా ఉన్నాయని అన్నారు.