calender_icon.png 28 January, 2026 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో ప్రభుత్వ విద్యారంగం మనుగడ ప్రశ్నార్థకం

28-01-2026 07:37:04 PM

ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతోనే పేదలకు నాణ్యమైన విద్య

ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ

మెదక్,(విజయక్రాంతి): తెలంగాణలో ప్రభుత్వ విద్యా రంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ స్టేట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం మెదక్ పట్టణంలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన 'తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ మెదక్ జిల్లా సర్వసభ్య సమావేశం'లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ​ఈ సందర్భంగా ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ  రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 15శాతం నిధులు కేటాయించాలని, అప్పుడే మౌలిక సదుపాయాల కల్పన సాధ్యమవుతుందని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు అరకొర వసతులతో, ఒకరిద్దరు ఉపాధ్యాయులతోనే నడవడం దురదృష్టకరమని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని పేర్కొన్నారు. ​ ఉపాధ్యాయులను బోధనకు దూరంగా ఉంచి, విద్యా సంబంధం లేని పనులు అప్పగించడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.​ ప్రభుత్వ పాఠశాలల మనుగడ కేవలం ఉపాధ్యాయుల వల్లనే కాకుండా, తల్లిదండ్రులు,ప్రజల చైతన్యం, నిరంతర పర్యవేక్షణ ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.​

అనంతరం ఈ సమావేశంలో కమిటీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వై.అశోక్ కుమార్  రాష్ట్ర కార్యదర్శి కె.రవి చందర్, టీపిటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బి.కొండల్ రెడ్డిలు మాట్లాడుతూ.. విద్యా రంగంలో ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న అశాస్త్రీయ ధోరణులను ఎండగట్టాలని, శాస్త్రీయ విద్యా విధానాల కోసం పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డా. పిడి ఆనందం, జె. రాంచంద్రం, బి. ముత్యాలు, విద్యాసాగర్, రాజేందర్, హీరాలాల్,  రెసిడెన్సియల్ టీచర్స్, పిడిఎస్ యూ విద్యార్థులు, టీపిటీఎఫ్ జిల్లాకమిటి సభ్యులు, విద్యాభిమానులు పాల్గొన్నారు. 

​మెదక్ జిల్లా కమిటీ ఎన్నిక:

ఈ సర్వసభ్య సమావేశంలో భాగంగా మెదక్ జిల్లా విద్యా పరిరక్షణ కమిటీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా యాదగిరి గౌరవ అధ్యక్షులుగా డా. పిడి ఆనందం,అసోసియేట్ అధ్యక్షులుగా సంగయ్య, ఉపాధ్యక్షులుగా రాంచంద్రం,ముత్యాలు, రాంకిషన్, భుజంగరెడ్డి, జోజప్ప, ప్రధాన కార్యదర్శిగా హీరాలాల్, అసోసియేట్ ప్రధాన కార్యదర్శిగా, రాజేంద్ర ప్రసాద్ కార్యదర్శులు గా మహేష్, ఉదయ్, జీవరత్నం, విద్యా సాగర్ ఉషారాణి తదితరులు ఎన్నికయ్యారు.