17-02-2026 12:00:00 AM
కోదాడ (అనంతగిరి ), ఫిబ్రవరి 16 : గుర్తింపు పొందినది మాత్రమే చరిత్ర కాదు. తన వెనకటి మనిషి ఎట్ల బతికిండో తెలుసుకోవాలని ప్రతి మనిషికి ఉంటది. ఆ తపనను, ఆ అన్వేషణ తాలూకు దాహాన్ని తీర్చేవి చరిత్ర ఆనవాళ్లే! అలా చరిత్ర మిగిల్చిన ఆనవాళ్లలో ’ప్రస్తుతం అనంతగిరిగా పిలవబడుతున్న ఒకప్పటి హనుమంతునిగిరి ఒకటి. పూర్వకాలం నందు రాజుల చరిత్ర, వారు వాడిన వస్తువులు, నివసించిన ప్రాంతాలు, వారి జీవనశైలి కొనసాగించిన తీరును వినడం కానీ చూడడం కానీ ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది.
అనేక చారిత్రాత్మకమైన గుట్టలు, చారిత్రాత్మకమైన ప్రదేశాలను మనం ప్రత్యక్షంగా వీక్షించాం... అటువంటి ప్రభుత్వం గుర్తించని చారిత్రాత్మకమైన గుట్ట, సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో ఉండడం విశేషం .హనుమంత గిరిగా పెరుగాంచిన అనంతగిరి గుట్టపై పాతకాలపు చరిత్ర సాక్షాలు ఇప్పటికీ సజీవంగా కళ్ళకు కనిపిస్తున్నాయి.... గుట్టపై దేవాలయ నిర్మాణాలు, పాతకాలపు కట్టడాలు , నీటి కొలను చూసేందుకు, నిత్యం ఈ గుట్టపై చుట్టుపక్క గ్రామాల తో పాటు ఇతర గ్రామాల నుండి కూడా ప్రజల వస్తూ పోతుంటారు...
కాకతీయులు, శ్రీకృష్ణదేవరాయలు అనంతగిరి పరిపాలించినట్టుగా ఆనవాళ్లు చెబుతున్నాయి ఇంతటి ప్రసిద్ధి కలిగిన గుట్ట పై ప్రభుత్వం గుర్తించకపోవడం తో చరిత్ర కలిగిన గుట్ట ప్రాచుర్యం పొందలేకపోయింది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గుట్టపై కాకతీయులు చక్రవర్తుల పరిపాలన కాలంలో హనుమంత గిరిగా పేరు గడిచి దీనిపై వారి నివాసం ఉన్నట్లు కనిపించే సాక్షాలు వీక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
చరిత్రకు సాక్షంగా అద్భుత కట్టడాలు
గుట్ట 800 ఎకరాల విస్తీర్ణంలో ఉండేదని, గుట్ట చుట్టూ108 ఆంజనేయ స్వామి విగ్రహాలు, 108 బావులు,108 కుంటలు,108 కోనేరులు ఉండేవని, కాలక్రమమైన అవి కనుమరుగై పోయాయని స్థానికులు చెబుతున్నారు.గుట్టపై భాగాన చుట్టూ సరిహద్దుగా సుమారు 10 అడుగుల ఎత్తు మేరా పెద్దపెద్ద రాళ్లతో పేర్చబడిన గోడ ఉండటం విశేషం....మానవుల సైతం మోయలేని రాళ్లతో నిర్మించిన ప్రహరీ ఇప్పటికి ఏ విధంగా నిర్మించారు అనేది ప్రశ్నార్థకంగానే ఉంది.
గుట్టపై ప్రాచీన కాలంలో ఉపయోగించిన వస్తువులు అప్పటి వారు పూజించే దైవ సన్నిధిలో చరిత్రకు అద్దం పట్టేలా నిలిచాయి. గుట్ట కింద భాగాన చుట్టూ పదుల సంఖ్యలో గుళ్ళ నిర్మాణాలు చేయడం అప్పటి ప్రజల దైవభక్తికి నిదర్శనమని స్థానికులు చెబుతున్నారు .గుట్ట పైభాగాన ఉన్న కొలనులో ఎటు నుండి నీరు ఉబికి వస్తుందో కూడా తెలియకుండా నిండుకుండలా ఉన్న కొలను ఎప్పుడు సందర్శకులు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
అధిక వేసవి కాలంలో కూడా ఈ నీటి కొలనులో నీరు తగ్గక చూపురలను కట్టిపడేస్తుంది. రాళ్లతో పేర్చబడిన ప్రహరీ మ ధ్యలో చుట్టూ నలవైపులా ఉన్న ముఖ ద్వా రాలు ప్రజలను ఆకర్షిస్తాయి చరిత్రతో పాటే అనంతగిరి గుట్ట ప్రావీణ్యానికి నోచుకోలేదు. ఇదే గుట్టపై కొన్ని నెలల క్రితం నూతన దేవాలయాల నిర్మించారు వీరితో పాటు అయ్యప్ప స్వాములు దీక్షలు సైతం ఈ గుట్టపై నిర్మించిన దేవాలయంలోనే జరిగే విధంగా అన్ని వసతులతో నిర్మించిన ఈ గుళ్ళలో నిత్యం పూజలు వెరిజల్లుతున్నాయి.
గుప్త నిధుల కోసం తవ్వకాలు...
చరిత్ర కలిగిన అనంతగిరిగుట్టపై కొందరు అక్రమార్కులు గుప్త నిధుల పేరుతో తవ్వకాలు జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు పై నుండి వీక్షిస్తున్న సందర్శకులకు కిలోమీటర్ల ఉన్న ఇతర గ్రామాలు ప్రదేశాలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంటాయి చుట్టూ పచ్చదనం చెట్లతో నిండిన గుట్టపై ఆహ్లాదాన్ని కలిగించే వాతావరణం వీక్షకులకు ఆనందాన్ని కలిగిస్తుంది అనంతగిరి గుట్ట నుండి ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఉన్న ప్రాచీన బిల్లా వరకు సొరంగ మార్గం ఉండేదని ధాన్యాన్ని ఇతరతా సామాగ్రాని అక్కడినుండి ఇక్కడ వరకు అప్పటి ప్రజలు ఎగుమతి చేసుకొని జీవనం కొనసాగించే వారిని స్థానికులు చెబుతున్నారు...
గుట్ట పైనుండి అనంతగిరి గ్రామంలోకి సొరంగ మార్గం ద్వారా రాకపోకలు కొనసాగించే వారిని తెలుస్తుంది. కానీ ఈ సొరంగా మార్గాల గుండా విష సర్పాలు, గబ్బిలాలు నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో వీటిని పూర్తిగా మూసివేశారు. ఈ గుట్టపై మరో చెప్పుకోదగ్గ ఈ గుట్టపై పెద్ద పెద్ద రాళ్లు కిందకు డొల్లుతున్నట్లు కనిపిస్తాయి కానీ వాటి కింద ఏటువంటి ఆధారం లేకున్నా కిందకి డోల్లకుండా వాటి స్థానంలోనే ఆగిపోయాయి. ఇటువంటి అనేక వింతలు ఈ గుట్టపై ఎన్నో ఉన్నాయి. ఇంతటి ప్రాచీనం నేపథ్యం కలిగిన గుట్టను ,ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ప్రాధాన్యత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
చారిత్రాత్మకమైన అయ్యప్ప దేవాలయం నిర్మాణం...
అనంతగిరి గుట్టపై ప్రస్తుతం చారిత్రాత్మకమైన హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయం నిర్మించారు. ఈ దేవాలయ నిర్మాణం నిజంగానే అద్భుతంగా చరిత్రలో నిలిచిపోనుంది. గుట్ట అంత ఎత్తు బాగానే దేవాలయం నిర్మించడం, దేవాలయానికి రాకపోకల కొరకు రహదారి నిర్మించడం అనేది చరిత్రలో స్థానం సంపాదించేందుకు ద్రోహద పడనున్నాయి. మరో శబరిగా పిలవబడే ఈ దేవాలయంలో నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా అనేకమంది అయ్యప్ప మాల ధరించి, స్వామి ఆశీస్సులు పొందుతున్నారు. భవితరాలు చెప్పుకునేలా ఆలయంపై దేవాలయ నిర్మాణం ఓ అద్భుతం.