17-02-2026 12:00:00 AM
గుంటూరుకు చెందిన గోపాలకృష్ణ అరెస్ట్
కిలో బంగారంతో ఉడాయించిన గుమస్తా
రూ.1.65 కోట్ల విలువైన బిస్కెట్లు రికవరీ
సిబ్బందిపై నిఘా ఉంచండి: డీసీపీ
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): ప్రముఖ జ్యువెలరీ షోరూమ్ జో యాలూకాస్‌లో జరిగిన భారీ చోరీ కేసును పంజాగుట్ట పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. నమ్మకంగా పనిచేస్తాడనుకున్న గుమస్తా యే చేతివాటం ప్రదర్శించి, ఏకంగా కిలో బంగారంతో ఉడాయించిన ఘటన కలకలం రేపింది. అయితే, ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే పోలీసులు నిందితుడిని పట్టుకుని, చోరీకి గురైన మొ త్తం సొత్తును రికవరీ చేసి తమ సత్తా చాటారు. పంజాగుట్ట ఏసీపీ పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్‌లో సుమారు రూ. 1 కోటి 65 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగింది...పంజాగుట్ట చౌరస్తాలోని జోయాలూకాస్ బ్రాంచ్‌లో కరమపూడి గోపాలకృష్ణ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఇతని స్వస్థలం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మహానాడు రోడ్డు. ఆదివారం షోరూమ్‌లో ఉన్న 10 బంగా రు బిస్కెట్లు ఒక్కొక్కటి 100 గ్రాములు మాయమైనట్లు సిబ్బంది గుర్తించారు. మొత్తం 1000 గ్రాములు 1 కిలో బంగారం కనిపించకుండా పోవడంతో షోరూమ్ ప్రతినిధి సెబాస్టియన్ వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశా రు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన కేసుగా పరిగణించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. సాంకేతిక ఆధారాలు, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని విశ్లేషించారు. ఈ క్రమంలో గోపాలకృష్ణే ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. నిరంతర గాలింపు చర్యల అనంతరం,
నేరం జరిగిన 24 గంటల లోపే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ. 1,65,00,000 ఒక కోటి అరవై ఐదు లక్షల విలువైన 10 బంగారు బి స్కెట్లను యథాతథంగా స్వాధీనం చేసుకున్నారు. అలాగే నేరానికి ఉపయోగించిన బజాజ్ ప్లాటినా బైక్, ఒక వీవో మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు.
యజమానులకు పోలీసుల హెచ్చరిక
ఈ ఘటన నేపథ్యంలో ఖైరతాబాద్ జోన్ డీసీపీ జ్యువెలరీ షాపుల యజమానులకు కీలక సూచనలు చేశారు. కేవలం బయటి దొంగల నుంచే కాకుండా, అంతర్గత భద్రతపైన కూడా దృష్టి సారించాలని సూచించారు.షాపుల లోపల, బయట, పార్కింగ్ ఏరియాల్లో, సెల్లార్లలో అత్యాధునిక సీసీటీవీలతో పాటు మోషన్ సెన్సార్ కెమె రాలు ఏర్పాటు చేసుకోవాలి.
సిబ్బందిని నియమించుకునేటప్పుడు వారి పూర్వాపరాలను కచ్చి తంగా పోలీస్ వెరిఫికేషన్ ద్వారా నిర్ధారించుకోవాలి.ఉద్యోగులు, సందర్శకులు లోపలికి వచ్చేట ప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేయాలి.లాకర్లు, షట్టర్ల విషయంలో ఫిజికల్ సె క్యూరిటీని పటిష్టం చేసుకోవడంతో పాటు, ఉద్యోగుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని డీసీపీ స్పష్టం చేశారు.