calender_icon.png 15 June, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా విమానాశ్రయంలో అరాచకం

10-06-2025 12:00:00 AM

భారత విద్యార్థి చేతికి బేడీలేసి హింసించిన పోలీసులు

వాషింగ్టన్, జూన్ 9: అమెరికాలోని నెవార్క్ విమానాశ్రయంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కునాల్ జైన్ అనే ఎన్నారై షాకింగ్ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అధికారుల తీరును ఖండిస్తున్నారు. ‘గత రాత్రి ఓ భారతీయ విద్యార్థికి ఓ క్రిమినల్‌లా చేతులకు బేడీలు వేసి తరలించడం చూశా. ఎన్నో కలలతో ఆ విద్యార్థి అమెరికాకు వచ్చి ఉంటాడు.

ఎవరికీ హాని తలపెట్టాలనే ఉద్దేశం అతడికి ఉండకపోవచ్చు. ఇది నన్ను బాధించింది. నిస్సహాయంగా అలానే చూస్తుండిపోయా.’ అని తెలిపారు. ఆ విద్యార్థి హర్యాన్వీ (హర్యానా ప్రజలు మాట్లాడే భాష)లో మాట్లాడుతున్నట్టు కూడా కునాల్ తెలిపారు. ఆ విద్యార్థి తనకు ఎటువంటి మతిస్థిమితం లేదని చెబుతున్నట్టు కనిపించిందన్నారు.

‘చాలా మంది యువత అమెరికా వీసా వచ్చిన మరుసటి రోజు ఉదయానికల్లా యూఎస్‌లో దిగుతున్నారు. ఇక్కడకు ఎందుకు వచ్చామని అధికారులకు సరిగ్గా వివరించలేకపోతున్నారు. దీంతో అధికారులు వారిని క్రిమినల్స్‌లా భావించి స్వదేశాలకు పంపుతున్నారు. గత కొద్ది రోజులుగా ఇక్కడ ఇటువంటివి మరింత ఎక్కువయ్యాయి.’ అని వెల్లడించారు.