17 April, 2026 | 10:26 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఐఈడీ పేలుడులో ఏఎస్పీ మృతి

10-06-2025 12:00 AM
  1. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
  2. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఘటన
  3. అధికారులు సహా ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు 

చర్ల, జూన్ 9 (విజయ క్రాంతి): చర్ల సరిహద్దు రాష్ర్టమైన ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జి ల్లాలో సోమవారం మావోయిస్టులు పో లీసు వాహనాన్ని ఐఈడీతో పేల్చేశారు. ఈ ప్రమాదంలో జిల్లా అదనపు ఎస్పీ ఆకాశ్ రా వు గిర్పుంజే మృతి చెందగా.. ఆయన వెంట వచ్చిన అధికారులు సహా ఇద్దరు జవాన్లు తీ వ్రంగా గాయపడ్డారు.

బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపిన వివరాల మేరకు.. మ ంగళవారం మావోయిస్టు పార్టీ ‘భారత్ బ ంద్’కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏఎస్పీ ఆ కాశ్ రావు ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజూమున కొంటా రోడ్డులోని దొండ్రా గ్రామం సమీపంలో సిబ్బందితో క లిసి పెట్రోలింగ్ నిర్వహించేందుకు వెళ్లారు. అప్పటికే భద్రతా బలగాలను నిలువరించేందుకు సిద్ధంగా ఉన్న మావోయిస్టులు ఐ ఈడీతో ఏఎస్పీ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు.

దీంతో తీవ్రంగా గా యపడిన ఏఎస్పీ ఆకాశ్‌రావును ఎయిర్‌లిఫ్ట్ ద్వారా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొ ందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఇక అధికారులు ఎస్‌డీవోపీ భాను ప్రతాప్ చ ంద్రకర్, టీఐ సోనాల్ గ్వాల్, ఇద్దరు జవాన్లను మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్‌కు తరలించారు.

అదనపు ఎస్పీ ఆకాశ్‌రావు మృత్యువార్త తెలిసి ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కడసారి ఆయన్ను చూసేందుకు ప్రజలు ఆయన నివాసానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. కాగా ఆకాశ్‌రావు అంత్యక్రియలు రాయ్‌పూర్‌లో మంగళవారం ని ర్వహించున్నట్టు అధికారులు తెలిపారు.