calender_icon.png 24 February, 2026 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో అరాచక పాలన

24-02-2026 01:22:08 AM

  1. మంత్రి వివేక్ నీచ రాజకీయాలకు తెరలేపారు
  2. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ lజైలులో బాల్క సుమన్‌తో ములాఖత్

ఆదిలాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం మంట గలుస్తోందని, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన గొడవ కేసులో ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎంపీ బాల్క సుమన్‌ను సోమవా రం కలిసి ములాఖత్ అయ్యారు. అనంతరం కొప్పుల ఈశ్వర్ మీడియా తో మాట్లాడుతూ... క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్ పార్టీ నేతల పట్ల వ్యవహరించిన తీరు అప్రజాస్వామికం అన్నారు.

చైర్మన్ ఎన్నిక జరిగే వరకు సుమన్ ను జైలులో ఉంచాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. సుమన్ పట్ల కాంగ్రెస్ ప్రభు త్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. జైలులో సుమన్‌కు సరైన సదుపా యాలు కల్పించకపోగా, అనారోగ్యంతో ఉన్న ఆయనకు వైద్యం సైతం అందించడం లేదని పేర్కొన్నారు.  ప్రజాస్వామ్య బద్దంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో క్యాతనపల్లి చైర్మన్ పిఠ మే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి వివేక్ ప్రజాస్వామ్యన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా నీచ రాజకీయాలకు తెరలేపారన్నారు.

మంత్రి వివేక్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యన్ని పరిరక్షించేందుకు నడుం బిగించిన బాల్క సుమన్‌తో పాటు, బీఅర్‌ఎస్ నేతల పై అక్రమ కేసులు పెట్టి, మా నేతలను జైలుకు పంపించారన్నారు. సుమన్‌కు బెయిల్ రాకుం డా ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. కస్టడీ కోరుతూ పోలీసులు బాల్క సుమన్‌ను వేదించాలని చూస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటి కైనా ప్రభుత్వం కుట్రలను పక్కకుపెట్టి సజావుగా ఎన్నిక నిర్వహించి, బాల్క సుమన్‌పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ జడ్పి చైర్మన్ ద్యావసంత, బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.