calender_icon.png 25 October, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనారోగ్యంతో మనస్తాపం.. అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య

25-10-2025 04:51:11 PM

ఎస్ఐ జే.రమేష్...

వేములవాడ టౌన్ (విజయక్రాంతి): కడుపునొప్పి సమస్యతో గత కొంతకాలంగా బాధపడుతున్న అంగన్వాడీ టీచర్ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన చందుర్తి మండలంలోని దేవుని తండా గ్రామంలో చోటుచేసుకుంది. సనుగుల గ్రామంకు చెందిన గొట్టే పరిమళ 36 దేవుని తండాలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఆమె భర్త ఆర్టీసీ హయర్ బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పరిమళ గత ఎనిమిది నెలలుగా గర్భసంచిలో గడ్డల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నా, ఎన్ని మందులు వాడినా కడుపునొప్పి తగ్గకపోవడంతో ఆమె తీవ్ర మనోవేదనకు లోనయ్యారు.

ఈ క్రమంలోనే శనివారం ఉదయం సుమారు 8:30 గంటల ప్రాంతంలో, ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి, తన బెడ్ రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు చందుర్తి ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనారోగ్యంతోనే పరిమళ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతురాలి ఆకస్మిక మరణంతో కుటుంబంలో తీరని దుఃఖం అలుముకుంది. అంగన్వాడీ టీచర్‌గా గ్రామ ప్రజలకు సుపరిచితురాలైన పరిమళ మృతి పట్ల స్థానికులు, సహచర ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.