25-10-2025 04:46:16 PM
సిఐటీయూ మండల 8వ మహాసభలో బ్రహ్మచారీ..
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లెందు పట్టణం ఏలూరి భవన్ లో కల్లేపల్లి మరియా, బోయిన శేఖర్, ఈసం పద్మ, ఎండీ మహమూద్ ల అధ్యక్షతన అమరజీవి కూకట్ల శంకర్ నగర్ లో శనివారం సిఐటీయూ మండల 8వ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా జండా విష్కరణను సిఐటీయు సీనియర్ నాయకులు వరంగంటి రాజమొగిలి ఆవిష్కరించారు. ఈ సభలో ప్రారంభ ఉపన్యాసాన్ని సిఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కొలగాని బ్రహ్మచారి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, స్కీమ్ వర్కర్ల ను కట్టు బానిసలుగా వాడుకుంటూ వెట్టి చాకిరీ చేయిస్తూన్నాయని కనీస వేతనాలు ఇవ్వడం లేదని కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వాలు ఊడిగం చేయిస్తున్నాయని రాబోయే రోజుల్లో ప్రభుత్వం మెడలు వంచి కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ సాధన కోసం నడుం చేయి చేయి కలిపి సమస్త కార్మికులు కలిసి కట్టుగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
సిఐటీయు మండల కన్వీనర్ తాళ్లూరి కృష్ణ గత మూడు సంవత్సరాల కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. తర్వాత సీఐటీయూ జిల్లా నాయకులు అబ్దుల్ నబీ, ఈసం వెంకటమ్మ, ఎస్ హెచ్ సుల్తానాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్లతో వెట్టిచాకిరి చేయిస్తున్నాయని అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా వర్కర్లు, హాస్టల్ డైలీ వేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్లు, వీఓఏలు, గ్రామ పంచాయతీ కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నాదని, కామ నాగరాజు మాట్లాడుతూ వెల్ఫర్ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని అన్నారు. ఈ మహాసభలో ఐద్వా మండల కార్యదర్శి సంఘీభావంగా మాట్లాడారు. కార్యక్రమంలో అరుణ, చింతా రాంబాయి, షేక్ ఫాతిమా, దీప్తి, కుమారి, సావిత్రి, కోటమ్మ, బోయిన పద్మ, తోట శివకృష్ణ, లక్ష్మణ్, తారాబాయి, సత్యనారాయణ కోరి, గొట్టిపర్తి శ్రీకాంత్, సాదిక్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.