25-10-2025 04:53:55 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): కార్తీక మాసం నాగుల చవితి పురస్కరించుకొని మహిళలు పాము పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం నాగుల పంచమి సందర్భంగా దేవాలయాల్లో పూజారులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. శివాలయాల్లో స్వామివారికి దంపతులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. నాగుల చవితి సందర్భంగా నాగమానస దేవికి సర్ప సూక్తంతో విశేష అభిషేకాలు చేశారు. సుల్తానాబాద్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లోనూ నాగుల చవితి వేడుకలను మహిళలు, ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.