calender_icon.png 9 May, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీ టీచర్స్ కలెక్టరేట్ ముట్టడి

19-03-2025 12:34:50 AM

వనపర్తి టౌన్, మార్చి 18 : తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ( సిఐటియు అనుబంధం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చౌక్ నుండి వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ అనంతరం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ను నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం. రాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, తెలంగాణ అంగ న్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జి. శారద, జిల్లా కార్యదర్శి బి.నారాయణమ్మ పాల్గొని ప్రసంగిస్తూ మార్చి 17 ,18 తేదీలలో వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాలు చేయడం జరిగిందన్నారు.

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంగన్వాడీలకు కనీస వేత నం 18000 ఇస్తామని హామీ ఇచ్చారు అవి వెంటనే జీవోలు ఇచ్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు నాయకులు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్ నుండి మెయిన్ టీచర్ గా పనిచేస్తున్న అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.