calender_icon.png 9 May, 2025 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్‌లో బీసీలకు రూ.31 వేలకోట్లు కేటాయించాలి

19-03-2025 12:32:57 AM

జాతీయ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ

ముషీరాబాద్, మార్చి 18 (విజయ క్రాంతి) : 2025-26 రాష్ట్ర బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రూ.31 వేలకోట్లు కేటాయించాలని జాతీయ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ అన్నారు.

ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు కాపు సంక్షేమ సం ఘం జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు తో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు అసెంబ్లీలో ఆమోదించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

బడ్జెట్‌లో బీసీలకు 27 శాతం తగ్గకుండా కేటాయించాలని కోరారు. గత బడ్జెట్‌లో బీసీలకు తక్కువ నిధులు కేటాయించిందని, కాగా గత ఏడాది బడ్జెట్‌కి సంబంధించిన 11 వేల కోట్లు రాబోయే బడ్జెట్ 20 వేల కోట్లు మొత్తం 31 వేల కోట్లు కేటాయించాలని కోరారు. అన్ని పార్టీ లు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఐక్యంగా సాధించుకోవాలని పిలుపునిచ్చారు.