15 June, 2026 | 10:19 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

అంగన్వాడీలు సమయపాలన పాటించాలి

10-02-2026 12:58 AM

ఐసీడీఎస్ సీడీపీఓ ఇందిరా

జైనూర్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): అం గన్వాడీ కార్యకర్తలు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఐసీడీఎస్ జైనూర్ ప్రాజెక్ట్ అధికారి సీడీపీఓ ఇందిరా సూచించారు. సోమవారం మండల కేంద్రంలో జైనూర్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉదయం 9 గంటల నుండి సాయం త్రం 4 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాల్లో హాజరు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.

సమయపాలన పాటించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. అంగన్వాడీ కేంద్రాల్లో మూమెంట్ రిజిస్టర్ నిర్వహించడంతో పాటు ఆన్లైన్ వర్క్, రిజిస్టర్లు సక్రమంగా మెయింటేన్ చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత పాటి స్తూ, వంట సామాగ్రి శుభ్రంగా ఉంచాలని, పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సూపర్వైజర్లు నాగమ్మ, సోంబాయి, హజీరా, సృజన, శ్యామ్, కోఆర్డినేటర్ నరేష్ పాల్గొన్నారు.