15 June, 2026 | 11:26 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

స్టూడెంట్‌ను పెళ్లి చేసుకున్న టీచర్

10-02-2026 12:58 AM
  1. పదో తరగతి విద్యార్థినిని ట్రాప్ చేసిన కీచక ఉపాధ్యాయుడు
  2. పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు
  3. నిందితుడిపై పోక్సో కేసు నమోదు
  4. మేడ్చల్ జిల్లాలోని శ్రీచైతన్య స్కూల్‌లో ఘటన

ఘట్‌కేసర్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ అన్నోజిగూడలోని శ్రీ చైతన్య పాఠశాలలో గురువే కీచకుడిగా మారాడు. తన దగ్గర చదువుకుంటున్న పదో తరగతి బాలికపై కన్నేసి, ప్రేమ పేరుతో వంచించి, రహస్యంగా పెళ్లి చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీచైతన్య పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించినప్పటికీ, నిజం ఎక్కువ రోజులు దాగదు కాబట్టి అసలు విషయం బయటపడింది.

అన్నోజిగూడ శ్రీ చైతన్య పాఠశాలలో పర్రే మైటీన్ (27) భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని అతను తన మాటలతో ట్రాప్ చేశాడు. ఈ క్రమంలోనే ఆ బాలికకు మాయమాటలు చెప్పి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న సమయంలో విద్యార్థిని మెడలో పసుపు తాడు (తాళి) ఉండటాన్ని గమనించిన తల్లి దిగ్భ్రాంతికి గురైంది. కూతురిని గట్టిగా నిలదీయగా, తన ఫిజిక్స్ టీచర్ పర్రే మైటీన్ పెళ్లి చేసుకున్నాడని చెప్పింది.

కంగుతిన్న తల్లిదండ్రులు తక్షణమే పాఠశాల ప్రిన్సిపాల్‌ను ఆశ్రయించారు. తల్లిదండ్రుల నిలదీతతో మొదట తనకు ఏమీ తెలియదని ప్రిన్సిపాల్ బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే, సదరు ఉపాధ్యాయుడిని పిలిపించి అడగగా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నానంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు.

విషయం బయటకు పొక్కితే పాఠశాల పరువు పోతుందని భావించిన యాజమాన్యం, గోప్యంగా ఉంచుతూనే నిందితుడిని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ‘నమ్మకంతో చదువు కోసం పంపిస్తే, కూతురి జీవితాన్ని నాశనం చేశాడు. ఇటువంటి కీచక గురువులకు కఠిన శిక్ష పడాలి’ అని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.