15 June, 2026 | 8:59 PM

Breaking News

విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ   •   ఆర్థిక పరిస్థితులను బాగు చేసింది ముఖ్యమంత్రి   •   గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి   •   అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •   మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక   •   సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •  

విధులపై స్పష్టమైన అవగాహన ఉండాలి

10-02-2026 12:57 AM

అధికారులకు కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశం

నిర్మల్, ఫిబ్రవరి ౯ (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే ప్రతి అధికారి తమ బాధ్యతలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనబోయే సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియలో ప్రతి ఓటు అత్యంత కీలకమని ఓట్ల లెక్కింపు సమయంలో అధికారులు అత్యంత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డిఈవో భోజన్న, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలుఓటు హక్కును వినియోగించుకోవాలి

ప్రజలంతా మున్సిపల్ ఎన్నికలలో స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం ఉదయం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి, ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) ఆధ్వర్యంలో ఓటరు అవగాహన పెంపొందించుటకు ర్యాలీ నిర్వహించారు.

ఆర్డీవో కార్యాల యం వద్ద ఈ ర్యాలీని, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటర్లందరూ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.