13 May, 2026 | 1:32 AM

‘పంచముఖి’లో వైభవంగా ఆంజనేయస్వామి జయంతి

13-05-2026 12:03 AM

మెదక్, మే 12 (విజయక్రాంతి): మెదక్ పట్టణం గోసముద్ర తటాక తీరాన వెలసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించారు.

ఆలయ వంశానుగత ధర్మకర్త కాకులవరం మధుసూదనాచారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామివారికి ఆవుపాలతో అభిషేకం, మహాఅలంకరణ, మహా మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ గావించారు.  సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, లోక కల్యాణార్ధం హోమం నిర్వహించారు. అన్న ప్రసాద వితరణ చేశారు. మెదక్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది.