27 February, 2026 | 10:31 PM

Breaking News

చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే పద్మావతి

27-02-2026 08:33 PM

మోతె,(విజయక్రాంతి): మండల పరిధిలోని అన్నారి గూడెం గ్రామ ఉప సర్పంచ్ అర్వపల్లి గణేష్ కూతురుకి శుక్రవారం అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించగా, ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, కోదాడ శాసనసభ్యులు నల్ల మాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి, హాజరై చిన్నారిని ఆశీర్వాదించి. గణేష్ కుటుంబ సభ్యులతో కాసేపు గడిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, మాజీ జడ్పి టిసి పి. పుల్లారావు, రాష్ట్ర కిసాన్ సెల్ కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఇంద్రాల సుప్రజ శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచ్ లు కోల లింగయ్య,  మాజీ సర్పంచ్ లు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.