జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి
ఉట్నూర్,(విజయక్రాంతి): జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మార్చి 10న ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఏజెన్సీ ప్రాంతంలోని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని సీఐ మడవి ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్, నార్నూర్ పోలీస్ సర్కిల్ ఆధ్వర్యంలోని ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లలో జాబ్ మేళా గోడ పత్రికలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక కృషితో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ కంపెనీలలో 2000 ఉద్యోగాలు కల్పించుటకు జాబ్ మేళా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. జాబ్ మేళా గోడ పత్రికలపై స్కాన్ చేసి నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కాడే ఉత్తం, సర్పంచ్ మోహన్ సింగ్ రాథోడ్, ఎస్సై సాయన్న, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ మారుతి డోంగ్రే తదితరులు పాల్గొన్నారు.




