5 June, 2026 | 1:44 PM

కొత్త రాజకీయా పార్టీ ప్రకటించిన అన్నామలై

05-06-2026 12:38 PM

తమిళనాడు నుండి ఒక కీలక రాజకీయ పరిణామం.

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో(Tamil Nadu politics) సంచలనం. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన అన్నామలై కుప్పుసామి(Annamalai Kuppusamyకొత్త పార్టీని ప్రకటించారు. దీంతో తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం అయింది. కొత్త రాజకీయ ఉద్యమం ప్రారంభిస్తున్నానని అన్నామలై పేర్కొన్నారు. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో(amil Nadu elections) తన పార్టీ పోటీ చేస్తోందని వెల్లడించారు. భారతీయుడిగా, తమిళుడిగా గర్విస్తున్నానని తెలిపారు. తమిళనాడు అభివృద్ధే తన ప్రథమ ప్రాధాన్యమన్నారు.

తన రాజీనామా ఆమోదించిన బీజేపీ హైకమాండ్(BJP High Command)కు అన్నామలై ధన్యవాదులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు ఎంతో గౌరవం అన్నారు. మార్పు కోసమే గతంలో బీజేపీలో చేరినట్లు సూచించారు. 18 నెలలుగా బీజేపీతో విభేదాలు కొనసాగాయని అన్నామలై స్పష్టం చేశారు. తన రాజకీయ పార్టీలో కొత్తవారిని ప్రోత్సహిస్తానని చెప్పుకొచ్చారు. సామాన్యుడు కేంద్రంగా రాజకీయాలు ఉండాలన్న అన్నామలై రాజకీయాల్లో ఎవరి కుర్చీ శాశ్వతం కాదని సూచించారు. కె. అన్నామలై అధికారికంగా బీజేపీకి వీడారు. 2019లో సివిల్ సర్వీస్‌కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఈ మాజీ ఐపీఎస్ అధికారికి ప్రారంభమైన ఒక అధ్యాయం ముగియడంతో పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్ శుక్రవారం నాడు అన్నామలై ప్రాథమిక సభ్యత్వ రాజీనామాను ఆమోదించారు.