2 March, 2026 | 9:44 PM

జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం

02-03-2026 07:43 PM

పెంచికల్పేట,(విజయక్రాంతి): మండలకేంద్రములోని పీఎం శ్రీ జెడ్పీఎస్ఎస్  పాఠశాలలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు వీడ్కోలు సమావేశం, పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను ప్రధానోపాధ్యాయులు సమర్పించారు. వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు గ్రామ పెద్దలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల చేత బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎలకపల్లి సర్పంచ్ భక్తు రామచందర్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ స్వప్న,ఘనపురం నాగేష్, చిలువేరి భాస్కర్, ఉప సర్పంచ్ టకిరే అనిల్ కుమార్, బండి ప్రభాకర్,ప్రధానోపాధ్యాయులు టి. విజయనిర్మలతో పాటు ఉపాధ్యాయులు యాదగిరి, గంగాభవాని, భాగ్యశ్రీ, ఉజ్వల, ఆత్మారాం, సమ్మయ్య, ధనరాజ్, సంతోష్, లక్ష్మి, భారతి, నాగరాణి, ఈశ్వర్ రావు, మౌనిక, ఆప్తాబ్, విజయ్, సుజాత, కానిస్టేబుల్ రమేష్, గ్రామస్తులు హాజరయ్యారు.