నిర్మల్ భరోసా కేంద్రం రాష్ట్రస్థాయిలను గుర్తింపు
నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరిచి మొదటి స్థానం సాధించిన నిర్మల్ జిల్లా షీ టీమ్ సభ్యులను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, శనివారం జిల్లా భరోసా కేంద్రాన్ని సందర్శించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడం, ఫిర్యాదులపై తక్షణ స్పందనతో సమర్థవంతంగా విధులు నిర్వహించడం వల్లే రాష్ట్ర స్థాయిలో ఈ ఘనత సాధించారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా మరింత సమర్థవంతంగా పనిచేసి జిల్లా పోలీసులకు మరిన్ని విజయాలు తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించడం జిల్లా పోలీసు శాఖకు గర్వకారణమని పేర్కొంటూ, షీ టీమ్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ ఎం. నర్సయ్యతో పాటు షీ టీమ్ సభ్యుల సేవలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.






