జుక్కల్ మండల వ్యవసాయ అధికారి సస్పెండ్
ఫర్టిలైజర్ డీలర్లకు ముందుగా సమాచారం ఇచ్చారని ఏవోపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆగ్రహం
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం వ్యవసాయ అధికారిని మహేశ్వరీని శనివారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్థానికంగా ఉన్న ఫర్టిలైజర్ డీలర్లకు తనిఖీలకు వస్తున్నట్లు ముందుగా సమాచారం ఇవ్వడంతో మండల వ్యవసాయ శాఖ అధికారి మహేశ్వరీని సస్పెండ్ చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు. ఫర్టిలైజర్ డీలర్ల అవినీతిని ప్రోత్సహించడంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ అది కారులు దాడులు చేస్తారని ముందుగానే సమాచారం డీలర్లకు ఇవ్వడంతో ఆమెను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి హెచ్చరించారు.






