21 June, 2026 | 2:42 AM

44 మందికి 3 లక్షల వార్షిక ప్యాకేజీ

21-06-2026 01:24 AM

క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో జ్యోతిష్మతి విద్యార్థుల ప్రతిభ

తిమ్మాపూర్, జూన్ 20 (విజయ క్రాంతి): జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌కు చెందిన ఫైనల్ ఇయర్ బీ ఫార్మసీ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో విశేష విజయాన్ని సాధించారు. కళాశాలకు చెందిన 44 మంది విద్యార్థులు హైదరాబాద్‌లోని మేడ్ ప్లస్ వారి ఆప్టివల్ హెల్త్ సొల్యూ షన్స్ ప్రైవేట్ లిమిటెట్‌లో ట్రైనీ ఫార్మసిస్ట్లుగా ఎంపికై, వార్షికంగా మూడు లక్షల ప్యాకేజీను పొందారు.

ఈ ఇంటర్వ్యూలు మెడ్‌ప్లస్‌కు చెందిన హెచ్‌ఆర్ అసిస్టెంట్ మేనేజర్ ఆకుల రాజు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ జె. సాగర్ రావు, సెక్రటరీ, కరస్పాండెంట్ జె. సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ డాక్టర్ వి. రాజ్‌కుమార్ ఎంపికైన విద్యార్థులను అభినందించారు.