28 August, 2026 | 10:34 AM

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో మరో నిందితుడి అరెస్ట్

28-08-2026 09:30 AM

జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన రామచంద్రాపురం పోలీసులు

రామచంద్రాపురం,ఆగస్టు 28: మొన్న సాయిలు,నిన్న రవి నేడు వీరబద్రుడు ఇంకెందరు మహానుబావులు మైనర్ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో మరో నిందితుడిని రామచంద్రాపురం పోలీసులు(Ramachandrapuram Police) అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు రామచంద్రాపురం సబ్‌ డివిజన్ పోలీసులు గురువారం ప్రెస్‌నోట్ విడుదల చేశారు. 


పోలీసుల వివరాల ప్రకారం.. 2025 ఫిబ్రవరి 13న మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఒక నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు మరో నిందితుడిని గుర్తించారు. తాజాగా 46 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం గురువారo నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇదే కేసుకు సంబంధించి 56 ఏళ్ల మరో నిందితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని సైబరాబాద్ కమిషనరేట్,రామచంద్రాపురం సబ్ డివిజన్ పోలీసులు తెలిపారు.